తెలంగాణలో రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని రైతుల బ్యాంకుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఇవాళ్టి నుంచి జమ కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరం వరకు సాగు చేస్తున్న భూములకు సంబంధించి మొత్తం 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలకు రైతు భరోసా సాయం జమ కానున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతు భరోసా నిధులు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.