ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణాలో లబ్ధిదారుడినికి ఉచితంగా అందజేయాలని, ఇసుక రవాణా విషయంలో లబ్ధిదారునికి ఎలాంటి భారం కలుగకుండా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రతి వారం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతిని సమీక్షిస్తానని మంత్రి తెలిపారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిన్నరలో కొండంత చేశాం, గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నాం. సాధించిన ప్రగతికి విస్తృత ప్రచారం కల్పించాలి. అప్పుడు, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీది గోబెల్ ప్రచారమే..అని అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.