చాలా మంది విడాకులకు కారణం కేటీఆర్: మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై.. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 Oct 2024 2:50 PM IST
చాలా మంది విడాకులకు కారణం కేటీఆర్: మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై.. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. మహిళా మంత్రి అని కూడా చూడకుండా ట్రోల్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవహేళన చేస్తే ఖండించే సంస్కారం కూడా కేటీఆర్‌కు లేదా అన్నారు. ప్రముఖ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని అన్నారు మంత్రి కొండా సురేఖ. పద్దతి పాడు లేకుండా ఇష్టా రీతిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా రెచ్చిపోతుందని ఫైర్ అయ్యారు. దుబాయ్ నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోందని అన్నారు. మహిళలు అంటే కేటీఆర్‌కు చిన్నచూపు అంటూ మండిపడ్డారు.

సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణమన్నారు మంత్రి కొండా సురేఖ. ఎంతో మంది జీవితాలో ఆడుకున్నారని అన్నార. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఎన్‌ కన్వెన్షన్‌ విషయంలోనే ఇది జరిగిందనీ... అలాగే.. మరో హీరోయిన్‌ రకుల్‌ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్‌ వైఖరే కారణమని అన్నారు. హీరోయిన్స్ కి కేటీఆర్‌ డ్రగ్స్‌ అలవాటు చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. ఇక తనపై సోషల్‌ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌ మీద మాజీ మంత్రి హరీశ్‌రావు మనసున్న మనిషిలా స్పందించారని, కేటీఆర్‌ మాత్రం స్పందించలేదని అన్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story