ఆ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి

రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ నల్గొండ నగరంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జూలై 1 సోమవారం ఆదేశించారు.

By Medi Samrat  Published on  1 July 2024 8:15 PM IST
ఆ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి

రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ నల్గొండ నగరంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జూలై 1 సోమవారం ఆదేశించారు. బిల్డింగ్ ని నెలరోజుల క్రితమే కూల్చివేయాలని ఆదేశించాను.. ఆ ఉత్తర్వును ఇంకా ఎందుకు పాటించలేదని అధికారిని ప్రశ్నించారు. భవనం ఇప్పటికీ ఎలా ఉంది? ఎందుకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ కమిషనర్‌ను నిల‌దీశారు. అదే పేదవాడి ఇల్లు అయితే కూల్చివేత త్వరగా జరిగి ఉండేదని.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

కూల్చివేత ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్‌ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఆ ప్రాంతంలో అతి త్వరలో హాస్టల్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాలని నల్గొండ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డిని ఆదేశించారు.

Next Story