Telangana: లోక్‌సభ ఎన్నికల్లో BRS-BSP పొత్తు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్.

By Srikanth Gundamalla  Published on  5 March 2024 10:55 AM GMT
telangana, lok sabha, election, brs, bsp ,

Telangana: లోక్‌సభ ఎన్నికల్లో BRS-BSP పొత్తు

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌ అధికారాన్ని కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్. మంగళవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్‌.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్.. కేసీఆర్‌ను కలిసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. లౌకికత్వం ప్రస్తుతం దేశంలో ప్రమాదంలో ఉందని అన్నారు. పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే భావనలో ఉన్నారు. సెక్యులర్ భావాన్ని నిరంతరం కాపాడిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. బీజేపీ నుంచి తెలంగాణలో లౌకికత్వానికి ప్రమాదం ఉందని అన్నారు. కాంగ్రెస్‌ కూడా అదే తోవలో ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలను బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని ఎదుర్కొనాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక సీట్ల పంపకాలపై బీఎస్పీ చీఫ్‌ మాయవతితో చర్చించాక చెబుతామని అన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తప్పకుండా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని.. ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ అన్నారు. మాయావతితో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడారు అని.. ఆ తర్వాత ప్రవీణ్‌ కుమార్‌ పొత్తు విషయం తన వద్దకు తెచ్చారని కేసీఆర్ చెప్పారు. ఇదే విషయంపై మాయావతితో తాను రేపు మాట్లాడుతానని కేసీఆర్ అన్నారు. ఇక త్వరలోనే సీట్ల పంపకాలపై కూడా చర్చలు జరుపుతామని అన్నారు. ఆ తర్వాత విధివిధానాలను కూడా ప్రకటిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు.

Next Story