తెలంగాణలో ఆదివారం 459 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అత్యధికంగా 323 కేసులు జిహెచ్‌ఎంసిలో నమోదయ్యాయి. ఆ తర్వాత 40 కేసులు రంగారెడ్డి జిల్లాలో, 29 కేసులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నమోదయమ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 5,180కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 468 మంది కరోనా నుంచి కోలుకున్నారు,
దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,96,833కి చేరుకుందని కోవిడ్ హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆరోగ్య శాఖ ఆదివారం 22,193 కోవిడ్ రాపిడ్ పరీక్షలను నిర్వహించింది. వాటిలో 127 నమూనాల ఫలితాలు రావాల్సివుంది. మొత్తంమీద ఆరోగ్య శాఖ ఇప్పటివరకు 3,58,62,191 కోవిడ్ పరీక్షలను నిర్వహించింది. మొత్తం కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 8,06,124 కాగా.. రికవరీ రేటు 98.85 శాతం ఉంది.