తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రారంభమైన పరీక్షలు మార్చి 18 వరకు జరగ్గా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
యుద్ధ ప్రాతిపదికన మూల్యాంకనం పూర్తి చేసిన బోర్డు, సాంకేతిక పరీక్షల అనంతరం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమైంది. విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లలో కూడా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల విడుదల తర్వాత రీ-వాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా బోర్డు ప్రకటించనుంది.