తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

Telangana inter first year results release. డిసెంబర్‌ 16 గురువారం మధ్యాహ్నం.. తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో విద్యార్థులు 49

By అంజి  Published on  16 Dec 2021 9:54 AM GMT
తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

డిసెంబర్‌ 16 గురువారం మధ్యాహ్నం.. తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో విద్యార్థులు 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 56 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి చూడొచ్చు. అక్టోబ‌ర్ 25,2001 నుంచి న‌వంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు నిర్వ‌హించిన ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను డిసెంబ‌ర్ 15న(నిన్న‌) విడుదల చేయ‌నున్న‌ట్లు తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ తెలిపింది. అయితే.. కొన్ని అనివార్య కార‌ణాల వల్ల ఫ‌లితాలు విడుద‌ల కాలేదు. అయితే తాజాగా ఇంటర్‌ బోర్డు ఫలితాలను విడుదల చేసింది.

ఫ‌లితాల‌ను ఇంట‌ర్ బోర్డ్ అఫిష‌య‌ల్ వెబ్‌సైట్‌లో tsbie.cgg.gov.in విడుదల చేశారు. ఫ‌లితాలు కోసం విద్యార్థులు పై వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. రూల్‌నెంబ‌ర్‌, పుట్టిన తేదీ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. అనంత‌రం స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో విద్యార్థులు ఏ ఫ‌రీక్ష‌లో ఎన్ని మార్కులు సాధించారో వంటి వివ‌రాలు ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఒకేసారి సైట్‌లోకి వెళ్లి ఫ‌లితాల కోసం అన్వేషిస్తే.. స‌ర్వ‌ర్లు బిజీ అయిపోయాయి. క‌నుక examresults.ts.nic.in అనే వెబ్‌సైట్‌లో కూడా విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు.

Next Story