తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం దసరా సెలవులను సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు ప్రకటించింది. సెలవులు తర్వాత అక్టోబర్ 6న నుంచి అన్ని ఇంటర్ కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అన్ని జూనియర్ కళాశాలలు షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య ఒక ఆదేశంలో కోరారు. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దని ఆయన ఆదేశించారు.
ఇక తెలంగాణ ఇంటర్ బోర్డు అన్ని జూనియర్ కళాశాలలు ఈ సెలవుల షెడ్యూల్ కచ్చితంగా పాటించాల్సినదిగా స్పష్టం చేసింది. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. ముఖ్యంగా ప్రైవేట్, ఆర్థిక సహాయం పొందే ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే వారి అఫిలిషియేషన్ రద్దు చేయబడుతుందని చెప్పారు