ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక..!
Telangana Inter Admissions Schedule Released. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్య గమనిక..! ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల
By Medi Samrat Published on 25 May 2021 2:40 PM GMTతెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్య గమనిక..! ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి గాను నేటి నుంచి జూలై 5 వరకు తొలి విడత అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు వారి ఎస్ఎస్సీ మార్కుల జాబితాలను సమర్పించాక ఇంటర్ అడ్మిషన్ నిర్ధారణ అవుతుంది. జూన్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులు చేపట్టనున్నారు. రెండో విడత అడ్మిషన్ల తేదీని త్వరలోనే ప్రకటిస్తారని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్య బోర్డు షెడ్యూల్ లో పేర్కొంది. విద్యార్థులకు అడ్మిషన్ టెస్టులు నిర్వహించకూడదని కూడా ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇటీవల వచ్చిన గ్రేడుల ఆధారంగా చేర్చుకోవాలని.. ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు ఇవ్వకూడదని తెలిపింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా టెన్త్ ఎగ్జామ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి ఫలితాలను కూడా ఇటీవలే వెల్లడించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ మొదటి వారంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా కేసుల నమోదు తగ్గితే వచ్చే జూన్ చివరల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.