హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాగా మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తీర్పు వెలువరించింది.
కాగా గతంలో ప్రకటించిన మెయిన్స్ రిజల్ట్స్‌ను రద్దు చేసింది. మళ్లీ మూల్యాంకనం చేయాలని దాని ఆధారంగానే ఫలితాలను వెలువరించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలిపింది. అందులో ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారందరికీ అవకాశం కల్పించాలని సూచించింది. కాగా 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.