బండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం
జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
By Srikanth Gundamalla Published on 5 Sep 2023 9:20 AM GMTబండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నేత, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ పలుమార్లు గైర్హాజరు అయ్యారు. తాజాగా మరోసారి కూడా బండి సంజయ్ గడువు కోరగా తెలంగాణ హైకోర్టు ఆయనపై అసహనం వ్యక్తం చేసింది.
కాగా.. బండి సంజయ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. అందుకే మరోసారి గడువు ఇవ్వాలని బండి సంజయ్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఎన్నికల పిటిషన్లపై ఆరు నెలల్లో విచారణ జరిపించి.. తీర్పులు వెల్లడించాల్సి ఉన్న సమయంలో ఇలా వ్యవహరించడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించిన ఆయన గత జులై 21వ తేదీ నుండి మూడుసార్లు గడువు కోరారు. ఆరునెలల్లో విచారణ పూర్తిచేస్తామని అంతేకాక బండి సంజయ్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేడయంతో.. ఈ నెల 12న బండి సంజయ్ కోర్టుకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.