విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Telangana high court stays state government order to reopen educational institutions. తెలంగాణ విద్యాసంస్థ‌ల్లో ప్ర‌త్య‌క్ష బోధ‌న‌పై హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

By Medi Samrat  Published on  31 Aug 2021 1:33 PM IST
విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తెలంగాణ విద్యాసంస్థ‌ల్లో ప్ర‌త్య‌క్ష బోధ‌న‌పై హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది.

ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని కోరింది. గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.


Next Story