Telangana: కమ్మ, వెలమ సంఘాల భవన నిర్మాణాలపై హైకోర్టు స్టే

వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణానికి కేటాయించిన భూముల విలువను తెలుసుకోవడానికి తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

By అంజి  Published on  29 Aug 2023 9:54 AM IST
Telangana, High Court,building construction, Kamma, Velama Sanghas

Telangana: కమ్మ, వెలమ సంఘాల భవన నిర్మాణాలపై హైకోర్టు స్టే 

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణానికి కేటాయించిన భూముల విలువను తెలుసుకోవడానికి తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలమ, కమ్మ వర్గాలకు వారి వారి కమ్యూనిటీ భవన్‌ల నిర్మాణానికి ఒక్కొక్కరికి ఐదు ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఈ మేరకు 2021 జూన్‌ 30న జీవో 47 జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాల్‌ చేస్తూ వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విశ్రాంత ప్రొఫెసర్‌ ఏ వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. కేవలం ఆ కులాల కోసం పనిచేసే సంఘాలకు ఉచితంగా భూమి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ఆ భూములకు మారెట్‌ విలువను నిర్ణయిచేందుకు అనుమతించాలన్న అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ విన్నపాన్ని హైకోర్టు ఆమోదించింది. అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను నివేదించాలని పేర్కొన్నది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదన్న గత ఉత్తర్వులను కొనసాగించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వ భూమి మదింపు ప్రకారం.. అఖిల భారత వెలమ సంఘం, కమ్మ వారి సేవా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిందని అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్ కోర్టుకు తెలియజేయడంతో కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.

Next Story