సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
మరోసారి సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 9:08 AM GMTసింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మరోసారి సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
అయితే.. అక్టోబర్ 28వ తేదీన సింగరేని ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీ వరకు ఓటర్ లిస్ట్ తయారు చేయాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. గత ఏడాది నుండి హైకోర్టులోనే సింగరేణి ఎన్నికల వివాదం కొనసాగుతూ ఉంది. ఇదివరకు ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హైకోర్టు మూడుసార్లు ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 23వ తేదీన సింగరేణి ఎన్నికలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించవలసిందిగా సింగిల్ బెంచ్ కూడా ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై సింగరేణి యాజమాన్యం చీఫ్ కోర్టులో అప్పీల్ చేశారు. దీంతో నేడు హైకోర్టులో సింగ రేణి ఎన్నికలపై వాద ప్రతివాదాలు జరిగిన అనంతరం ఎన్నికలను మరో సారి వాయిదా వేసింది. డిసెంబర్ 27వ తేదీన సింగరేణి ఎన్నికలు నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా తమ తరఫు వాదనలు వినిపంచింది. 43వేల మంది ఓటర్ల జాబితా రెడీ అయ్యిందని చెప్పింది. ఇప్పటికే ఎన్నికలు పలుమార్లు వాయిదా పడ్డాయని తెలిపింది. ఇక ఇరువైపుల వాదనలు విన్నతర్వాత తెలంగాణ హైకోర్టు సింగరేని ఎన్నికలను వాయిదా వేసింది. డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.