తుషార్ ను అరెస్టు చేయవద్దు

Telangana High Court order not to arrest Tushar. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో కేరళకు చెందిన తుషార్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

By Medi Samrat  Published on  30 Nov 2022 6:45 PM IST
తుషార్ ను అరెస్టు చేయవద్దు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో కేరళకు చెందిన తుషార్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల క్రితం తుషార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు తుషార్ ను అరెస్ట్ చేయవద్దని సిట్ ను ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎన్డీయే కన్వీనర్ తుషార్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, తుషార్ తరఫున మహేష్ జెఠ్మలానీ వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 6 కు వాయిదా వేసింది. తుషార్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ మహేష్ జెఠ్మలానీ రాజకీయ కోణంలోనే ఈ కేసును నమోదు చేశారని.. దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. కానీ దర్యాప్తు ఆ విధంగా జరగడం లేదని వాదించారు. సిట్ దర్యాప్తు వివరాలు మీడియాకు లీకు అవుతున్నాయన్నారు. దర్యాప్తు ఎలా జరగాలో పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను మహేష్ జెఠ్మలానీ ప్రస్తావించారు. 41A CRPC నోటీసులకు రీప్లై ఇవ్వకుండా లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయని మహేష్ జెఠ్మలానీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గంటకుపైగా వాదనలు వినిపించిన మహేష్ జెఠ్మలానీ, సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కోరారు.

రామచంద్రభారతికి బీఎల్ సంతోష్ కి తుషార్ మధ్యవర్తిగా వ్యవహరించారని సిట్ అనుమానిస్తుంది. ఈ విషయమై ఈ ముగ్గురిని విచారించాలని సిట్ భావిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 26న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది.



Next Story