తెలంగాణలో పాఠశాలలను 31నుంచి తెరుస్తారా..? : ప్రశ్నించిన హైకోర్టు
Telangana High court on Corona Situations in state.తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో శుక్రవారం
By తోట వంశీ కుమార్ Published on 28 Jan 2022 12:42 PM ISTతెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఆన్‌లైన్ ద్వారా చేపట్టిన ఈ విచారణకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డీహెచ్ డాక్టర్.శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16శాతంగా ఉందని న్యాయస్థానానికి ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వే చేపట్టి 3.45లక్షల కిట్లు అందజేసినట్లు వివరించారు. కాగా.. పిల్లల సంబంధించిన మందులు కిట్లలో లేవని ప్రశ్నించగా.. వారి మందులను కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇక పాఠశాలలపై ప్రారంభంపై వివరాలు తెలపాలని, ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా..? అని హైకోర్టు ఆరా తీసింది. విద్యా సంస్థల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. వారాంతపు సంతల్లో కరోనా నియంత్రణ ప్రభుత్వం ఎటువంటి చేపట్టారో తెలపాలని, సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదకను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 3,944 నమోదు అయినట్లు గురువారం రాత్రి విడుదల చేసిన బులిటెన్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,51,099 కి చేరింది. 2,444 మంది కరోనా మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 7,07,498కి చేరింది. నిన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,081గా నమోదు అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,520 యాక్టివ్ కేసులు ఉన్నాయి.