తీన్మార్ మల్లన్నకు బెయిల్‌ మంజూరు.. 74 రోజుల పాటు జైలులో

Telangana High Court grants bail to Teenmar Mallanna. జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు బెయిల్‌ మంజూరు అయింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు

By అంజి  Published on  8 Nov 2021 7:17 AM GMT
తీన్మార్ మల్లన్నకు బెయిల్‌ మంజూరు.. 74 రోజుల పాటు జైలులో

జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు బెయిల్‌ మంజూరు అయింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌తో పాటు రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేసి రెండు నెలలకుపైగా జైల్లో ఉంచారు. దీంతో పాటు అతని కార్యాలయంలో పోలీసులు చేసిన సోదాల్లో హార్డ్‌ డిస్క్‌లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా బెయిల్‌ కోసం తీన్మార్‌ మల్లన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇవాళ బెయిల్‌ మంజూరు చేసింది. తీన్మార్‌ మల్లన్న పై ఇప్పటి వరకు 38 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఆరు కేసులను కోర్టు కొట్టివేసింది. మిగిలిన 32 కేసుల్లో 31 కేసులకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం తీన్మార్‌ మల్లన్న జైలు విడుదల అయ్యే అవకాశం ఉంది. తీన్మార్‌ మల్లన్న భార్య ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసింది. తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ కమిషన్ కూడా తీన్మార్‌ మల్లన్నపై పెట్టిన కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story
Share it