వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 5:15 PM ISTతెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం సహా వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్-ఛాన్సలర్ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలో యూనివర్శిటీల వైస్ ఛాన్స్‌లర్ల పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్త వీసీల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు నియామకాలు జరిపింది. అందుకు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదలైంది.
- పాలమూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా జీఎన్ శ్రీనివాస్
-వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి
-హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా కుమార్ మొగ్లారం
-కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ఉమేష్ కుమార్
-హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నిత్యానందరావు
-నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా అల్తాఫ్ హుస్సేన్
-తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్ వైస్ ఛాన్సలర్‌గా యాదగిరిరావు
-హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య
- శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా రాజి రెడ్డి
వివిధ యూనివర్సిటీల నియామకాల ప్రక్రియను తమ ప్రభుత్వం వేగవంతం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టులోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నియామకాలు జరిగాయి.