కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థ‌ల్లో సోదాలు

Telangana GST teams search bjp leader Rajagopal Reddys Sushee Infra at banjara hills. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు.

By Medi Samrat
Published on : 14 Nov 2022 4:16 PM IST

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థ‌ల్లో సోదాలు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా, ఈ సోదాలు ఇవాళ మధ్యాహ్నం నుండి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 20 మంది రాష్ట్ర జీఎస్టీ అధికారుల బృందం.. సుశీ ఇన్‌ఫ్రాలోని పలు రికార్డ్‌లను గత కొన్ని గంటలుగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.

మరో వైపు మునుగోడులో బీజేపీ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ధ‌ర్నాకు దిగారు. మునుగోడులో గొల్ల కురుమలతో కలిసి రాజ్ గోపాల్ రెడ్డి నిరసనకు దిగారు. మునుగోడు కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కోమటిరెడ్డి పూలమాలవేసి, వినతి పత్రం అందజేశారు. గొల్ల కురుమలకు బ్యాంకుల్లో వేసిన డబ్బులను వారికి ఇవ్వాలని మునుగోడు మండల కేంద్రంలో కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.


Next Story