తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర ఎండల వల్ల వచ్చ వడగాల్పులను 'రాష్ట్ర నిర్దిష్ట విపత్తు'గా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి వడదెబ్బ బారిన పడే బాధితుల కుటుంబాలకు ఉపశమనం కల్పించే ఉద్దేశ్యంతో, పునరావాస సహాయ నిబంధనల ప్రకారం ఎక్స్-గ్రేషియా/సహాయం అందించాలని నిర్ణయించబడింది. తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బ బాధితులకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్ర ఎండల మధ్య రాష్ట్రంలో ఎంతో మంది పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవుడ్ డోర్ కార్మికుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. వడగాల్పులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, ఆర్థికంగా ప్రభావితమైన కార్మికులకు విపత్తు భత్యం అందించనుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.