Eye Care Clinics: తెలంగాణ వ్యాప్తంగా 'ఐ కేర్‌ క్లినిక్స్‌'.. మంత్రి కీలక ప్రకటన

ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 'ఐ కేర్‌ క్లినిక్స్‌' ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు.

By -  అంజి
Published on : 3 Jan 2026 2:47 PM IST

Telangana govt, Eye Care Clinics, eye health services, Telangana

Eye Care Clinics: తెలంగాణ వ్యాప్తంగా 'ఐ కేర్‌ క్లినిక్స్‌'.. మంత్రి కీలక ప్రకటన

హైదరాబాద్‌: ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 'ఐ కేర్‌ క్లినిక్స్‌' ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. ఈ క్లినిక్‌ల నిర్వహణలో సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి 'హబ్‌'గా వ్యవహరిస్తుందన్నారు. గత రెండేళ్లలో 6,12,973 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయించామన్నారు. 33.65 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు స్క్రీనింగ్‌ నిర్వహించి, 76,176 మందికి అద్దాలు పంపిణీ చేశామని మంత్రి వివరించారు.

శాసన మండలిలో రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.. ఆర్‌ఎంపీ, పీఎంపీలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య , ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విద్య , వైద్య శాఖల మంత్రిగా సేవలను అందించటం వరంగా భావిస్తున్నామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందిస్తున్న సబ్ సెంటర్స్, ఆరోగ్య మందిర్ లను, CHC కేంద్రాలను, ఏరియా ఆసుపత్రులను, GGH లకు అనుసంధానం చేస్తున్నామన్నారు . RMP / PMP లకు గతంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం RMP , PMP లకు శిక్షణ ఇవ్వటం పై IMA - తెలంగాణ , డాక్టర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు ను అశ్రయించటంతో న్యాయపరమైన అంశాలు కోర్ట్ లో పెండింగ్ లో ఉన్నాయన్నారు . RMP , PMP ల సమస్యల పరిష్కరానికి కట్టుబడి ఉన్నామన్నారు. శాసన మండలి సభ్యులు చేసిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.

Next Story