త్వరలో మ‌రో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్లు

Telangana Govt to issue orders to fill 16,940 posts soon. వ‌చ్చే నెల‌లో 16,940 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

By Medi Samrat  Published on  29 Nov 2022 3:00 PM GMT
త్వరలో మ‌రో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్లు

వ‌చ్చే నెల‌లో 16,940 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ విభాగాల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, సహా వివిధ ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ యూనిట్లు ఈ విషయంలో ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించాయి.

మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో అధికారులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వివిధ శాఖల్లో నియామక ప్రక్రియను సమీక్షించారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని, నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో నోటిఫికేషన్‌లు విడుదల కానున్నందున సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయాలని, అవసరమైన అన్ని వివరాలను త్వరితగతిన టీఎస్‌పీఎస్సీకి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించాలని సోమేష్ కుమార్ కోరారు. రిక్రూట్‌మెంట్‌ను చేపట్టి, నిర్ణీత షెడ్యూల్‌తో ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే సూత్రప్రాయ క్లియరెన్స్ ఇచ్చింది.

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వీ శేషాద్రి, ప్రిన్సిపల్ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఫారెస్ట్‌ ఆర్‌ఎం దోబ్రియాల్‌, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవిగుప్తా, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Next Story