మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న తెలంగాణ పౌరుల భద్రత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందించేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24x7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ భవన్ అధికారులు నిరంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రయాణ ఆటంకాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఈ క్రింది అధికారులను సంప్రదించవచ్చు:
వందన బారువా (PS టు రెసిడెంట్ కమిషనర్): +91 9871999044
సిహెచ్ చక్రవర్తి (PRO): +91 9958322143
జావేద్ హుస్సేన్ (లైజన్ ఆఫీసర్): +91 9910014749
రక్షిత్ నాయక్ (లైజన్ ఆఫీసర్): +91 9643723157
విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వారు లేదా రాష్ట్రంలోని వారి కుటుంబ సభ్యులు ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. పౌరులందరికీ అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.