తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) స్థాయికి పదోన్నతి కల్పించింది. అధికారులు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, బి శివధర్ రెడ్డి, అభిలాష బిష్త్, సౌమ్య మిశ్రా, శిఖా గోయెల్ లకు డీజీపీలుగా పదోన్నతి సాధించారు.
పదోన్నతి పొందన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూస్తున్న బి.శివధర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిస్త్, జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా, సీఐడీ చీఫ్ శిఖా గోయల్ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు.