తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Govt Key Decision On Masks. తెలంగాణలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర‌ వ్యాప్తంగా మాస్కుల వినియోగం

By Medi Samrat  Published on  27 March 2021 3:08 PM GMT
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర‌ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణచట్టంలోని 51 నుండి 61 వరకు గల సెక్షన్ల కింద.. అదేవిధంగా ఐపీసీ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. మాస్క్‌ నిబంధన కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఇదిలావుంటే.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 495 పాజిటివ్ కేసులు నమోదు కావడంపై మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. నిన్న ఒక్కరోజులో 247 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,241 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 1,870 బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,05,804కు చేరుకుంది. ఇక మొత్తం మృతి చెందిన వారి సంఖ్య1,685కు చేరింది.


Next Story