గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా 60 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది.

By Medi Samrat  Published on  6 Feb 2024 5:02 PM IST
గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా 60 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. గ్రూప్‌-1లో మరో 60 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రూప్‌-1 పోస్టుల సంఖ్య 563కి చేరాయి. ఈ మొత్తం పోస్టులకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. అయితే, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీకేజ్ కారణంగా ఆ పరీక్ష రద్దైంది. దాంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే!! డిసెంబర్ 2024 నాటికి తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న వాళ్లకు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Next Story