హైదరాబాద్: పాలిసెట్‌లో ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికి, 1000 లోపు ర్యాంకులు సాధించిన వారికీ మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందివ్వనుంది. మిగతవారికి రూ.14,900 ఫీజు చెల్లించనుంది. ఈ ఏడాది ప్రైవేట్ కాలేజీల్లో ఫీజును రూ.39 వేలకు పెంచింది. ఇదిలా ఉంటే.. పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు మంగళవారం కేటాయించారు.
ఫస్ట్ ఫేజ్‌లో 65.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లలో ప్రభుత్వ కాలేజీల్లో 82 శాతం సీట్లు నిండగా, ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం సీట్లు నిండాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 10,012 సీట్లు భర్తీ కాలేదు. 80,949 మంది క్వాలిఫై కాగా, 20,811 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. సీట్లు పొందినవారు 18లోగా ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలి. 31వ తేదీ నుంచి పాలిటెక్నిక్ మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభమవుతాయి.