అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు అందజేయనున్న సీఎం కేసీఆర్‌

Telangana Govt Allotted new cars for additional collectors. తెలంగాణ రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్

By Medi Samrat  Published on  13 Jun 2021 4:07 PM IST
అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు అందజేయనున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ మేరకు 32 కార్లను ప్రగతి భవన్‌కు తెప్పించారు. సీఎం కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లో అదనపు కలెక్టర్లు, డీపీఓలతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే అదనపు కలెక్టర్లకు సీఎం స్వయంగా వాహనాలు అందజేయనున్నారు.

ఇదిలావుంటే.. పల్లె, పట్టణ ప్రగతి పురోగతి, అధికారుల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో అధికారులతో చర్చిస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేపట్టాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్షించి.. పెండింగ్‌ పనుల పూర్తికి మార్గదర్శనం చేయనున్నారు.


Next Story