తెలంగాణలో ఒక్క‌సారిగా పెరిగిన‌ కరోనా కేసులు.. అప్ర‌మ‌త్త‌మైన ఆరోగ్య శాఖ‌

Telangana Govt Alert After Corona Cases Increase in State. తెలంగాణ‌లో గ‌త రెండు, మూడు రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

By Medi Samrat  Published on  21 Jun 2022 9:23 PM IST
తెలంగాణలో ఒక్క‌సారిగా పెరిగిన‌ కరోనా కేసులు.. అప్ర‌మ‌త్త‌మైన ఆరోగ్య శాఖ‌

తెలంగాణ‌లో గ‌త రెండు, మూడు రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 403 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రజారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ జీ శ్రీనివాస్ రావు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు అవసరమైతే తప్ప ఆరుబయటకు వెళ్లకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అంద‌రూ విధిగా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఫేస్ మాస్క్‌లు ధరించాలని విజ్ఞ‌ప్తి చేసింది.

"20 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారిలో కోవిడ్ సంభవం ఎక్కువగా ఉంది. ప్రజలు పనుల‌కు వెళ్లేటప్పుడు, అవసరమైన కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని కోరారు. ఫేస్ మాస్క్‌లు ధ‌రించ‌డం ద్వారా కోవిడ్ -19 భారిన ప‌డ‌కుండ‌ ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

తెలంగాణతో సహా భారతదేశం అంతటా కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు స్వల్పంగా పెరిగాయని డిపిహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. "కోవిడ్ కేసుల పెరుగుదలను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండు డోస్‌లు తీసుకోవడం ద్వారా టీకాను పూర్తి చేయడం చాలా ముఖ్యం. కోవిడ్‌కు వ్యతిరేకంగా ఫేస్ మాస్క్‌లు ధరించడం.. భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించడం ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు 6 అడుగుల కంటే ఎక్కువ దూరం పాటించాల‌ని కోరారు. పని ప్రదేశాలలో సబ్బు, చేతి వాషింగ్ సౌకర్యం / శానిటైజర్ అందించాలని.. ఉద్యోగుల మధ్య తగిన భౌతిక దూరం పాటించాలని కోరారు.




















Next Story