రూ.2లక్షల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ బిగ్‌ అప్‌డేట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది.

By Srikanth Gundamalla
Published on : 6 July 2024 9:30 AM IST

telangana, government, rythu runa mafi, cm revanth reddy ,

రూ.2లక్షల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ బిగ్‌ అప్‌డేట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇందు కోసం నిధుల సమీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీఎం రేవంత్‌రెడ్డి సహా.. మంత్రులు ఆగస్టు 15 వరకు రుణమాఫీ అమలు చేసి తీరుతామని చెప్పారు. తాజాగా రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.

రూ. 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు కూడా దాదాపు రూ.40 వేల కోట్లు డబ్బులు జమ చేయాల్సి ఉంది. రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు రుణ సేకరణపై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు మెుదటి వారం నుంచి రైతు రుణమాఫీ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రుణమాఫీ ఒకేసారి అమలు చేస్తామని చెప్పగా.. తాజగా ఈ విషయంపై ఓ వార్త వినిపిస్తోంది. అందరికీ ఒకేసారి కాకుండా తొలి విడతలో రూ. 50 వేల వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రూ. లక్ష వరకు.. ఆ తర్వాత రూ. లక్షన్నర, రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారని తెలిసింది. మెుత్తం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న 40 లక్షల మంది రైతుల్లో 70 శాతం వరకు రైతుల రుణాలు లక్షలోపు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది.

రైతు భరోసా పథకం అమలుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సీజన్‌లో రైతు భరోసా కింద రూ.15వేల రెండు విడుతల కింద వేస్తామని చెబుతోంది. రైతుభరోసా అర్హులను నిర్ధారించడం, అలాగే ఎన్ని ఎకరాల లోపు పంట పెట్టుబడి ఇవ్వాలనేదానిపై సబ్ కమిటీ వేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక రాజకీయ, వ్యవసాయ సంఘాలతో సబ్‌కమిటీ చర్చలు జరిపి.. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదికను బట్టి ప్రభుత్వం రైతుభరోసాపై నిర్ణయం తీసుకోనుంది.

Next Story