కులగణన సర్వేలో పాల్గొనలేదా? మళ్లీ వివరాలు ఇవ్వొచ్చన్న మంత్రి
కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వవచ్చని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By Knakam Karthik
కులగణన సర్వేలో పాల్గొనలేదా? మళ్లీ వివరాలు ఇవ్వొచ్చన్న మంత్రి
కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వవచ్చని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి రాజకీయ పార్టీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే-2025 నివేదికను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో ముందుగా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించాం. ఆ తర్వాత ప్రతి ఇంటికి అప్లికేషన్లు తీసుకెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించారు. ఇతర రాష్ట్రాల్లో కులగణన, జనగణన ఎలా జరిగిందో పూర్తిగా అధ్యయనం చేసి కులగణన సర్వే చేశాం. మొత్తం ఎనిమిది పేజీలలో ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల పేర్లు, సంక్షేమ పథకాల లబ్ది, రిజర్వేషన్లు ఇలా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాం. మాన్యువల్ గా సేకరించి వాటిని కంప్యూటరీకరణ చేశాము. రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లను మ్యాపింగ్ చేసి 94 వేలకు యూనిట్లు గుర్తించాం. 150 ఇండ్లను రోజుకు 8-10 ఇండ్లు చొప్పున సర్వే చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
96% కులగణన సర్వే పూర్తిచేశాం !#CasteCensus pic.twitter.com/Vx958Fq3dS
— Ponnam Prabhakar (@Ponnam_INC) February 5, 2025