అలర్ట్..తెలంగాణలో ఆ నెంబర్ ప్లేట్స్ లేకుంటే వాహనాలు సీజ్

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అమర్చాలని ఆదేశించింది

By Knakam Karthik
Published on : 10 April 2025 7:25 AM IST

Telangana, Congress Government, Transport Department, High Security Number Plates,

అలర్ట్..తెలంగాణలో ఆ నెంబర్ ప్లేట్స్ లేకుంటే వాహనాలు సీజ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అమర్చాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1, 2019కి ముందుకు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అమర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఇందుకోసం సెప్టెంబర్ 30వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించింది.

2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రరైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్లు ప్లేట్లు లేకపోతే బండి సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. నెంబర్ ప్లేట్ల కోసం www.siam.in వెబ్‌సైట్‌లో బుకింగ్‌ చేసుకోవాలని పేర్కొన్నది. వచ్చే సెప్టెంబర్ 30వ తేదీవరకు గడువు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాతే కేసులు నమోదు చేయడం, బండి సీజ్ చేయడం వంటివి చేస్తామని రవాణాశాఖ స్పష్టం చేసింది. ఇన్యూరెన్స్, పీయూసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిబంధనలు విధించింది.

Next Story