పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణలో 70 ఏళ్లకు పైబడిన పెన్షన్ దారులకు, కుటుంబ పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By అంజి Published on 12 Jun 2024 7:35 AM ISTపెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణలో 70 ఏళ్లకు పైబడిన పెన్షన్ దారులకు, కుటుంబ పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. పే రీవిజన్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 70 నుంచి 75 ఏళ్ల లోపు వారికి బేసిక్ పెన్షన్‌పై 15 శాతం, 75 నుంచి 80 ఏళ్లు లోపు వారికి 20 శాతం, 80 నుంచి 85 ఏళ్ల లోపు వారికి 30 శాతం, 90 నుంచి 95 ఏళ్ల వారికి 50 శాతం, 95 నుంచి 10 ఏళ్ల లోపు వారికి 60 శాతం, 100 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే.. మరో రెండు మూడు రోజుల్లో కేబినెట్ భేటీ జరగబోతోందని.. అందులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లపై చర్చించి అదే రోజు తీపి కబురు వినిపించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వాటిని అమలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటాని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే.. వాటన్నింటినీ ఆపేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.