ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ ధర రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాగా మొదటి దశలో సొంత స్థలాలు ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ప్రభుత్వం యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో సొంత స్థలం ఉన్నవారిలో ఎక్కువగా పెంకుటిళ్లలో నివాసం ఉంటున్న దరఖాస్తుదారులే ఉన్నారని తేలింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపుగా 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఇందిరమ్ మిళ్ల యాప్ ద్వారా సర్వే చేపట్టారు. ఇందులో 9.19 లక్షల మంది దరఖాస్తుదారులకు సొంత స్థలాలు ఉన్నట్టు గుర్తించారు.