లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను ఉప‌సంహ‌రించుకున్న తెలంగాణ స‌ర్కార్‌

Telangana government has withdrawn the lunch motion petition. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  30 Jan 2023 3:22 PM IST
లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను ఉప‌సంహ‌రించుకున్న తెలంగాణ స‌ర్కార్‌

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లంచ్‌ మోషన్‌ పిటిషన్ ను తెలంగాణ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతోనే స‌మావేశాలు ప్రారంభిస్తామ‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు లాయ‌ర్ దుశ్యంత్ ద‌వే హైకోర్టుకు తెలిపారు. రాజ్యంగ‌ప‌రంగా నిబంధ‌న‌ల‌న్నీ నిర్వ‌ర్తిస్తామ‌ని కోర్టుకు తెలిపారు.

అంత‌కుముందు.. బడ్జెట్‌ సిఫార్సులకు గవర్నర్‌ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్‌ కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌ ముసాయిదా ప్రతులకు ఆమోదం తెలపలేదు అని, గవర్నర్‌ ఆమోదం తెలపకపోతే కష్టతరమవుతుందని ఏజీ.. బెంచ్‌ ముందు విజ్ఞప్తి చేశారు.

అయితే.. గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకోగలుగుతామని బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. లంచ్ మోషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న అడ్వకేట్ జనరల్ సమాధానంతో.. అందుకు బెంచ్‌ అంగీకరించింది. అయితే పిటిషన్‌ రెడీగా ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింద. సిద్ధంగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ఏజీకి స్పష్టం చేసింది. అయితే.. అనూహ్యంగా లంచ్‌ మోషన్‌ పిటిషన్ ను తెలంగాణ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది.


Next Story