Telangana Budget: రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లీతో రాష్ట్ర పద్దును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క...
By - అంజి |
Telangana Budget: రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లీతో రాష్ట్ర పద్దును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకెళ్తున్నామని చెప్పారు. సంక్షేమం, మహిళాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్ అని, ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో విద్యనందిస్తున్నామని తెలిపారు.
పేద, మధ్య తరగతి, ధనిక అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్టు భట్టి ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
బడ్జెట్ కేటాయింపులు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటన
ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం
రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన
వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు
విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
వైద్య శాఖకు రూ.13,679 కోట్లు
కార్మిక శాఖకు రూ.998 కోట్లు
మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు
ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు
మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు
మొత్తం బడ్జెట్.. రూ.3,24,234 కోట్లు
తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931
రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు
మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు
తలసరి ఆదాయం: రూ.4,18,931 (జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.9 శాతం ఎక్కువ)
రాష్ట్ర వృద్ధి రేటు: 10.2 శాతం