2023 సంవత్సరంలో సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 23 హాలిడేస్‌ను ప్రకటిస్తూ జీవో జారీ చేయడంతో.. వాటిని అనుసరిస్తూ రాష్ట్రంలో సెలవులను ఖరారు చేశారు. మొత్తం 28 రోజుల సాధారణ సెలవులు ఉండగా, మరో 24 రోజుల ఆప్షన్ హాలిడేస్‌ను ప్రకటించారు. జనవరి 15న సంక్రాంతి పండుగ ఉండగా, మార్చి 7న హోలి, 22న ఉగాది పండుగ సెలవులను ప్రకటించారు. ఆషాడం బోనాలు జూలై 17న ఉండగా, సెప్టెంబర్ 18న వినాయక చవితి, అక్టోబర్14న బతుకమ్మ పండుగ ప్రారంభం, 24న విజయ దశమి, ఆ మరునాడు కూడా దసరా సెలవును కొనసాగించారు. నవంబర్ 12న దీపావళి, 25న క్రిస్‌మస్ పండుగ సెలవులిచ్చారు. రంజాన్‌కు రెండు రోజుల సెలవు ఉంది. ఏప్రిల్22, 23న రంజాన్, జూన్ 29న బక్రీద్ పండుగ సెలవులను ప్రకటించారు. ఇక 24 ఆప్షనల్ హాలిడేస్ కూడా ఉన్నాయి. కనుమ, శ్రీ పంచమి, మహవీర్జయంతి, బుద్ధ పూర్ణిమ, రథ యాత్ర, వరలక్ష్మీ వ్రతం, దుర్గాష్టమి, నరక చతుర్థి, క్రిస్‌మస్ ముందు రోజున ఆప్షన్ హాలిడేగా ఇచ్చారు. రంజాన్, బక్రీద్, మొహర్రం వంటి పండుగలకు సెలవు తేదీలను మార్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.