తెలంగాణలోని ప్రభుత్వ ఇంటర్ మరియు ఐటీఐ విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రూ. 3,24,234 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో విద్యారంగానికి ఏకంగా రూ. 26,674 కోట్లు కేటాయించారు.
ఈ బడ్జెట్‌లో భాగంగా ఇప్పటివరకు కేవలం పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు వృత్తి విద్యా కోర్సులు చదివే ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ. 2,000 చొప్పున ఉపకార వేతనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.