మరో లాంగ్ వీకెండ్.. మీకోసం వెయిటింగ్
క్రిస్మస్ సోమవారం రావడంతో లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేస్తున్నారా
By Medi Samrat Published on 25 Dec 2023 7:45 PM ISTక్రిస్మస్ సోమవారం రావడంతో లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేస్తున్నారా? అయితే జనవరి 1వ తేదీని కూడా మీరు లాంగ్ వీకెండ్ లిస్టులోకి వేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 1ని జనరల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
న్యూ ఇయర్ వేడుకలకు పలు ఆంక్షలు :
నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు , పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు, పబ్‌లు, హోటళ్లు తెల్లవారుజామున 1 గంట వరకు పార్టీలు జరుపుకోవాలంటే.. ముందుగా పోలీసుల అనుమతిని పొందాలి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్‌హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజర్లతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు.ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని కూడా అధికారులు తెలిపారు. ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్‌లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని సూచించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తమ బృందాలు తనిఖీలు చేస్తారని అన్నారు.