Telangana: రైతులకు ప్రభుత్వం తీపికబురు.. ఎకరానికి రూ.10,000 పంట నష్టపరిహారం

రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా10 వేలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

By అంజి
Published on : 24 Sept 2024 6:30 AM IST

Telangana government, farmers, Distribution, crop damage compensation

Telangana: రైతులకు ప్రభుత్వం తీపికబురు.. ఎకరానికి రూ.10,000 పంట నష్టపరిహారం

కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతల్లా తాము దోచుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నెలలు గడిచినా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు. 2 రోజుల్లో పంట నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. అమృత్‌ టెండర్లలో తన సవాల్‌ను కేటీఆర్‌ స్వీకరించలేదని అన్నారు.

నేలకొండపల్లి మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం వల్ల చాలా నష్ట పోయామన్నారు. వరదలతో ప్రజలు అతలాకుతలం అయ్యారని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి చూశారని అన్నారు.

కేంద్రం సాయం కోసం చూస్తే ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలను కాపాడాలని వరదలతో నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం ఇచ్చామన్నారు. మునిగిన పంట పొలాలకు ఎకరానికి పది వేలు ఇస్తామని చెప్పామని, రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా10 వేలు ఇస్తామని తెలిపారు. సాగర్ కాలువ నాలుగు చోట్ల తెగిందన్న మంత్రి.. పాలేరు దిగువన ఉన్న రైతులందరికీ రేపటి కల్లా నీటిని అందిస్తామన్నారు.

Next Story