తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇద్దరు అధికారుల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ ఎస్పీగా చందనా దీప్తిని ప్రభుత్వం నియమించింది.

By Medi Samrat  Published on  31 Dec 2023 7:15 PM IST
తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇద్దరు అధికారుల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ ఎస్పీగా చందనా దీప్తిని ప్రభుత్వం నియమించింది. సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ గా అపూర్వ రావును బదిలీ చేశారు. ప్రస్తుతం నల్లగొండ ఎస్పీగా కొనసాగుతున్న అపూర్వ రావును బదిలీ చేసి ఆమె స్థానంలో వేకెన్సీ రిజర్వ్ లో ఉన్న చందనా దీప్తిని నల్లగొండ ఎస్పీగా నియమించింది ప్రభుత్వం. అపూర్వ రావుకు ఐసీడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్సీగా బాధత్యలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. చందనా దీప్తి ఇంతకుముందు నార్త్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఇటీవల పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. తాజాగా నల్లగొండ ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది.

జి చందన దీప్తి, (RR 2012) నల్గొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ చేయగా, K అపూర్వ రావు (RR 2014) క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి బదిలీ చేశారని అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

Next Story