తెలంగాణలోని యూనివర్సిటీలకు కొత్త వీసీలను ప్రకటించిన ప్రభుత్వం
Telangana government appoints Vice-Chancellors to 10 universities. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ లను నియమించింది
By Medi Samrat Published on
22 May 2021 2:42 PM GMT

రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ లను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు.. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని యూనివర్సిటీ లకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది. కరోనా నేపథ్యం లో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. అయితే.. శనివారం నాడు రాష్ట్ర గవర్నర్ వీసీ ల నియామకానికి ఆమోదం తెలిపారు.
వీసీల నియామకం వివరాలు..
ఓయూ వీసీగా ప్రొ. రవీందర్ యాదవ్
కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొ. రమేష్
అంబేద్కర్ వర్సిటీ వీసీగా సీతారామరావు
తెలుగు వర్సిటీ వీసీగా కిషన్‌రావు
శాతవాహన వర్సిటీ వీసీగా ప్రొ. మల్లేశం
తెలంగాణ వర్సిటీ వీసీగా రవీందర్ గుప్తా
మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ప్రొ. గోపాల్‌రెడ్డి
పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొ. రాథోడ్
జేఎన్‌టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి
జేఎన్ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా ప్రొ. కవిత దర్యాని
Next Story