ఎస్సీ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్, ఆ పథకం కోసం ఇవాళ్టి నుంచే అప్లికేషన్లు

విదేశాల్లో చదువుకునేందుకు అర్హులైన ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 20 March 2025 7:28 AM IST

Telangana, Congress Government, Overseas Scholarship,  SC Students

ఎస్సీ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్, ఆ పథకం కోసం ఇవాళ్టి నుంచే అప్లికేషన్లు

విదేశాల్లో చదువుకునేందుకు అర్హులైన ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ నెల 20 నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ఈ-పాస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన ఎస్సీ విద్యార్థుల కుటుంబాల కోసం తీసుకొచ్చారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కాలర్‌ షిప్‌ ద్వారా అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, సింగపూర్, జపాన్‌, సౌత్‌ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో చదువుకునే వారికి స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.

Next Story