తెలంగాణలోని విద్యాసంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం ఈ నెల 21 వ తేదీ నుంచి అక్టోబర్ 3 వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. 13 రోజులపాటు అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. దసరా పండుగ అనంతరం అక్టోబర్ 4న (శనివారం) పాఠశాలలను తిరిగి తెరువనున్నారు. ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు మాత్రం 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులను ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.