ఫిబ్రవరి 1న బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే(శాసన సభ్యుడి)గా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఆయనతో స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణం చేయించారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. కేసీఆర్ బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పడిపోవడంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. తుంటి ఆపరేషన్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే.
నవంబర్‌లో నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. గతంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని కూడా స్వీకరిస్తారు. ఎన్నికలకు ముందు, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ తరచూ పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలని భావిస్తున్నారు.