డబ్బు, విలువైన వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

తెలంగాణ రాష్ట్రంలో క్విక్ రెస్పాన్స్ బృందాల‌ను ఏర్పాటు చేశామని తెలంగాణ ఎన్నికల నోడల్ ఆఫీసర్, ఐటీ అడిషనల్ డెరైక్టర్ కార్తీక్ మాణిక్యం తెలిపారు.

By Medi Samrat  Published on  25 Oct 2023 9:15 PM IST
డబ్బు, విలువైన వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

తెలంగాణ రాష్ట్రంలో క్విక్ రెస్పాన్స్ బృందాల‌ను ఏర్పాటు చేశామని తెలంగాణ ఎన్నికల నోడల్ ఆఫీసర్, ఐటీ అడిషనల్ డెరైక్టర్ కార్తీక్ మాణిక్యం తెలిపారు. ఇన్‌కం టాక్స్ డీజీ సంజ‌య్ బ‌హ‌దూర్‌తో పాటు ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 33 జిల్లాలో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పని చేస్తున్నాయని వెల్ల‌డించారు. హైదరాబాద్‌లో 150 మంది అధికారులు ఎలక్షన్ డ్యూటీలో పని చేస్తున్నారని.. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. వాహనంలో 10 లక్షల కంటే ఎక్కువ నగదు క్యారీ చేస్తే సీజ్ చేస్తున్నామని తెలిపారు.

24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామ‌ని.. నగదు/విలువైన వస్తువుల తరలింపుపై CISF సమన్వయంతో బేగంపేట విమానాశ్రయం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెట్టామని వివ‌రించారు. 24 x 7 నిఘా కోసం ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్లు (AIU) ఏర్పాటు చేశామని వెల్ల‌డించారు. హైదరాబాద్‌కు కనెక్టివిటీ ఉన్న భారతదే శంలోని అన్ని ఇతర విమా నాశ్రయాల్లో కూడా నిఘా ఉందని వివ‌రించారు. హైదరాబాద్‌కు ప్రయాణించే ప్రయాణికులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాల‌ని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ కి ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.

ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్ ను రూపొందించామని తెలిపారు. ఎన్ని కల ప్రకటన వెలువడినప్పటి నుండి రూ.53.93 కోట్ల‌ నగదు, 156 కిలోల బంగారు ఆభరణాలు, 454 కిలోల వెండిని జప్తు చేశామని వివ‌రాలు వెల్ల‌డించారు. డబ్బు , విలువైన వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని.. సెక్షన్ 132 ప్రకారం సోదాలు చేస్తామని వెల్ల‌డించారు. సెక్షన్ 132A ప్రకారం.. లెక్కలు చూపని నగదును సీజ్ చేస్తామన్నారు. అక్టోబర్ 9 నుండి కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని తెలిపారు. నగదు రవాణాకు సంబంధించి సమాచారం వుంటే.. టోల్ ఫ్రీ నంబర్ 1800-425- 1785 లేదా లాండ్ లైన్ 040-23426201/23426202, లేదా వాట్సాప్ / టెలిగ్రాం : 7013711399 కు లేదా ఇ-మెయిల్ ఐడి: cleantelanganaelections@incometax.gov.ఇన్ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Next Story