Telangana: 45 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 8:16 PM ISTTelangana: 45 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది అధిష్టానం. ఇప్పటికే తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. జాతీయ నాయకత్వాన్ని ప్రచారంలో దింపింది. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక రేపట్నుంచి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారంలో పాలుపంచుకోనున్నారు. కాగా.. ఇప్పటికే కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రెండు జాబితాలకు కలిపి మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఇక రెండో జాబితాలో ఎల్బీనగర్ నుంచి మధుయాష్కిగౌడ్, బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి మునుగోడు టికెట్ దక్కించుకున్నారు. ఇక ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ బరిలో దిగనున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా:
సిర్పూర్: రావి శ్రీనివాస్
అసిఫాబాద్ (ఎస్టీ): అజ్మీరా శ్యామ్
ఖానాపూర్ : వెద్మర బొజ్జు
ఆదిలాబాద్: కంది శ్రీనివాస్ రెడ్డి
బోథ్ (ఎస్టీ): వెన్నెల అశోక్
ముథోల్: బోస్లె నారాయణ రావు పాటిల్
ఎల్లారెడ్డి: కె మదన్ మోహన్ రావు
నిజామాబాద్ రూరల్: డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
కోరుట్ల: జువ్వాది నర్సింగ రావు
చొప్పదండి (ఎస్సీ): మేడిపల్లి సత్యం
హుజురాబాద్: వడితాల ప్రణవ్
హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్
సిద్ధిపేట: పూజల హరికృష్ణ
నర్సాపూర్: ఆవుల రాజిరెడ్డి
దుబ్బాక: చెరకు శ్రీనివాస్‌రెడ్డి
కూకట్‌పల్లి: బండి రమేష్
ఇబ్రహీంపట్నం: మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్: మధు యాష్కి గౌడ్
మహేశ్వరం: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్: కస్తూరి నరేందర్
శేరిలింగంపల్లి: వి.జగదీశ్వర్ గౌడ్
తాండూర్: బయ్యని మనోహర్‌రెడ్డి
అంబర్‌పేట్: రోహిన్ రెడ్డి
ఖైరతాబాద్: పి.విజయారెడ్డి
జూబ్లీహిల్స్: మహ్మద్ అజహరుద్దీన్
సికింద్రాబాద్: డాక్టర్ జీవీ వెన్నెల
నారాయణపేట్: డా. చిట్టెం రెడ్డి
మహబూబ్‌నగర్ : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జడ్చర్ల : జె. అనిరుధ్ రెడ్డి
దేవరకద్ర: గావినోళ్ల మధుసూధన్ రెడ్డి
మక్తల్: వాకిటి శ్రీహరి
వనపర్తి: డా. జిల్లలెల చిన్నారెడ్డి
దేవరకొండ (ఎస్టీ): నేనావత్ బాలు నాయక్
మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
భువనగిరి: కుంబం అనిల్ కుమార్ రెడ్డి
జనగామ: కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
పాలకుర్తి : యశశ్విని
మహబూబాబాద్ (ఎస్టీ): డా. మురళీ నాయక్
పరకాల : రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ పశ్చిమ : నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ తూర్పు : కొండా సురేఖ
వర్ధన్నపేట (ఎస్సీ): కేపీ నాగరాజు
పినపాక (ఎస్టీ): పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల45 మందితో రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ pic.twitter.com/DnyugTaJKp
— Newsmeter Telugu (@NewsmeterTelugu) October 27, 2023