Telangana: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 7:58 AM GMTTelangana: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో విడుదల చేసింది. ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేశారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు ఖర్గే. అయితే.. ముందుగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు.. 42 పేజీలతో 62 ప్రధాన హామీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక పథకాలను పొందుపరిచారు.
తెలంగాణ ఎన్నికలు - కాంగ్రెస్ మేనిఫెస్టో
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టో విడుదల చేశారు.
- ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతి రోజూ 'ప్రజాదర్బార్'
- అమరవీరుల తల్లి/తండ్రి/ భార్యకు నెలవారీ గౌరవ పెన్షన్ రూ.25000, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
- రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ
- వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్
- 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికి స్కూటీ
- నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ.10 లక్షల వడ్డీలేని రుణం
- మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ
- ప్రతి ఏడాది జూన్ 2న జాబ్ క్యాలెండర్, సెప్టెంబర్ 17లోపు నియామకాల పూర్తి
- నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి
- టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన.. యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ