తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ తుది జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  10 Nov 2023 10:51 AM IST
telangana, elections, bjp, final list,

తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ తుది జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు ఈరోజే తుది గడువు. దాంతో.. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో చివరి జాబితాను వెల్లడించింది బీజేపీ అధిష్టానం. అయితే.. చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి, వనపర్తి అభ్యర్థులను మార్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి బీజేపీ 8 స్థానాలను కేటాయించింది. ఇప్పటికే జనసేన తన అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక తాజా జాబితాతో బీజేపీ 111 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లు అయ్యింది.

తుది జాబితాలో టికెట్‌ దక్కించుకున్నవారు:

నాంపల్లి: రాహుల్‌చంద్ర

చాంద్రాయణగుట్ట: కె.మహేందర్‌

కంటోన్మెంట్‌: గణేశ్ నారాయణ్‌

దేవరకద్ర: ప్రశాంత్‌రెడ్డి

వనపర్తి: అనుజ్ఞారెడ్డి

అలంపూర్‌: మేరమ్మ

నర్సంపేట:పుల్లారావు

మధిర: విజయరాజు

బెల్లంపల్లి: కొయ్యల ఎమాజీ

పెద్దపల్లి: దుగ్యాల ప్రదీప్‌

సంగారెడ్డి: దేశ్‌పాండే రాజేశ్వరరావు

శేరిలింగంపల్లి: రవికుమార్‌ యాదవ్‌

మేడ్చల్‌: ఏనుగు సుదర్శన్‌రెడ్డి

మల్కాజ్‌గిరి: ఎన్‌.రామచంద్రరావు

Next Story